నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం సన్న రకం వరి ధాన్యం క్వింటాలుకు గరిష్టంగా రూ. 2, 071, కనిష్టంగా రూ. 1, 439 పలికిందని మార్కెట్ కార్యదర్శి భారతి తెలిపారు. పెసళ్లు గరిష్టంగా రూ. 7, 419, కనిష్టంగా 6, 355, అలసందలు గరిష్టంగా రూ. 5, 658, కనిష్టంగా రూ. 4, 255, దొడ్డు రకం వరి గరిష్టంగా రూ. 1, 751, కనిష్టంగా 1, 731 ధర పలికిందని చెప్పారు.