నారాయణపేట: కేంద్ర బడ్జెట్ పై నిరసన

82చూసినవారు
నారాయణపేట: కేంద్ర బడ్జెట్ పై నిరసన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా వుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపేట అంబేద్కర్ కూడలిలో కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో బడ్జెట్ పై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కేంద్రం ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. బడ్జెట్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్