నారాయణపేట: లక్ష 48 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

57చూసినవారు
నారాయణపేట: లక్ష 48 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజా వరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతుల నుంచి 1. 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు.

సంబంధిత పోస్ట్