నారాయణపేట: రెండవ రోజు కొనసాగిన సైన్స్ ఫెయిర్
నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ రోజు శనివారం విద్య వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగింది. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు తిలకించి ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడు అంశాల్లో మొత్తం 170 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ప్రాజెక్టులు చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలి వచ్చారు.