సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా ఉంటామని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం సమ్మెకు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారని అన్నారు.