విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు అన్నారు. నారాయణపేట మినీ స్టేడియంలో కొనసాగుతున్న వేసవి అథ్లెటిక్, క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని ఏకాగ్రత, పట్టుదలతో క్రీడలో రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. పీఈటీలు పాల్గొన్నారు.