వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిభిరాల కరపత్రాలను శుక్రవారం నారాయణపేటలో ట్రస్మా యూనియన్ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 25 నుండి మే 25 వరకు జిల్లాలోని ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలోని 6వ తరగతి నుండి 8వ తరగతి విద్యార్థులకు వివిధ కార్యక్రమాలలో 30 రోజుల పాటు అవగాహన ఇచ్చి సర్టిఫికెట్ లను అందజేస్తామని తెలిపారు.