నారాయణపేట జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. రెండవ రోజు సీనియర్ సివిల్ జడ్జ్ వింధ్య నాయక్ మాట్లాడుతూ.. బాలల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత మనందరిపై ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.