నారాయణపేట: పశు వైద్య శిబిరం విజయవంతం

76చూసినవారు
నారాయణపేట: పశు వైద్య శిబిరం విజయవంతం
పశువుల్లో కృత్రిమ గర్భాధారణతో మేలు జాతి సంతతి పొందవచ్చునని జిల్లా పశు సంవర్ధక అధికారి ఈశ్వర్ రెడ్డి అన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శనివారం జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో గర్భకోశ, చూడి పరీక్షల శిబిరం నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ ఈశ్వర్ రెడ్డి పశువులను పరీక్షించిన అనంతరం పాడి రైతులకు సూచనలు చేశారు. పశువుల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ వైద్య సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్