రేపటి నుండి ఈనెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమలు అమలులో ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక సంఘాలు పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. సోషల్ మీడియాకు అనుచిత పోస్టులు పెట్టరాదని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.