నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు శుక్రవారం మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి బహుమతులు అందించారు. మొదటి బహుమతి అమర జవాన్ జట్టుకు రూ. 30 వెల నగదు, శిల్డ్, రెండవ బహుమతి సూపర్ శిక్సర్ జట్టుకు రూ. 20 వెల నగదు, శిల్డ్ అందించారు.