కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని సీపీఐ ఎం ఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు విజయలక్ష్మి, కాలేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పిన నేటికీ అమలు కావడం లేదని విమర్శించారు.