నారాయణపేట మండలంలోని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని గురువారం బీజేపీ నేతలు మహబూబ్ నగర్ లో ఎంపీ డికే అరుణను కలిసి వినతి పత్రం అందించారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి నిధులు కేటాయించాలని, శేర్ణపల్లి గ్రామంలో బిసి కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని కోరారు. ఎంపిని కలిసిన వారిలో ఓబీసీ మోర్చ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సాయిబన్న, మాజీ సర్పంచ్ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.