ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 31 వరకు జరిగే రోడ్డు భద్రత వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను శనివారం నారాయణపేట కలెక్టరేట్లో ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఓ మేఘా గాంధీ, డీఎస్పీ లింగయ్య, ఆర్ అండ్ బి డిఈ రాములు, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.