ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టాలని నారాయణపేట జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ కోరారు. శుక్రవారం నారాయణపేట పట్టణంలోని జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో సహకార సంఘం డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు రామకృష్ణ, ఆనంద్, విజయ్ కుమార్, సరోజ తదితరులు పాల్గొన్నారు.