జిల్లాలో విద్యా ప్రగతికి సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నూతన సంవత్సరంలో విద్యార్థుల సంపూర్ణ వికాసం కోసం పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి, నరసింహ పాల్గొన్నారు.