సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వరకు సమ్మె విరమించేది లేదని జేఏసీ నాయకులు తమ్మప్ప శివకుమార్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. శనివారం సమ్మెను ఉద్దేశించి వారు మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని, అదే ప్రాతిపదికపై తమను కూడా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు.