గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, రజాకార్ల పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు, మహిళలు, కార్మికులు, కర్షకులు వీరోచితంగా పోరాడారు. 1948, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారికంగా నిర్వహిస్తోంది అని పేర్కొన్నారు.