నాగర్ కర్నూలు పట్టణంలో, భారత సాంఘిక విప్లవోద్యమ పితామహుడు, ద్రవిడ ఉద్యమ నేత, జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు పెరియార్ రామస్వామి నాయకర్ 145వ జయంతి వేడుకలు బిఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెరియార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పెరియార్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు.