వనపర్తి జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా రెండో సారి ఎంపికైన శ్రీనివాస్ గౌడ్ ను మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణ అధ్యక్షుడు విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు సతీశ్ కుమార్, వ్యాపారవేత్త రమేశ్, నరేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.