వనపర్తి: బాధితునికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు

82చూసినవారు
వనపర్తి: బాధితునికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు
వనపర్తి జిల్లా పానగల్ మండలం అన్నారం తండాలో తండావాసి గురువారం రోడ్డుపై వెళ్ళుతూ కళ్లు తిరిగి పడిపోయాడు. అటుగా వెళ్తున్న మండల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యులు డాక్టర్ మైథిలి, డాక్టర్ తారా శశాంక్ బాధితుని గమనించి అత్యవసర చికిత్స అందించారు. బాధితునికి మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర చికిత్స అందించినందుకు వైద్యులను పలువురు గ్రామస్తులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్