వనపర్తి: దాడి కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

68చూసినవారు
వనపర్తి: దాడి కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
దాడి కేసులో నేరస్థుడికి ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ వనపర్తి జిల్లా 2వ అదనపు ప్రధాన న్యాయమూర్తి జానకి సోమవారం తీర్పు ఇచ్చారు. గోపాల్ పేటకు చెందిన ఒక వ్యక్తి పొలం దారి విషయంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులపై రాళ్లతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినవారు 2021 డిసెంబర్ 22 న గోపాల్ పేట పీస్ లో ఫిర్యాదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో దాడి చేసిన వ్యక్తికి ఈ మేరకు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్