త్వరలో శ్రీలంక, భారత్ మధ్య మూడు టీ20, వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. అయితే, భారత జట్టు ఎంపికలో కొంతమంది ఆటగాళ్ల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జింబాబ్వేతో టీ20 సిరీస్‌తో అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్‌ను లంకతో రెండు సిరీస్‌కు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పరాగ్‌కు బదులు తిలక్ వర్మను కోచ్ గంభీర్ భారత జట్టులోకి తీసుకోవాలని భావించాడట. అయితే, ఐపీఎల్ లో తిలక్ వర్మ చేతికి గాయం కావడం పరాగ్‌కు కలిసొచ్చింది.