రియల్‌మీ మార్కెట్‌లోకి రియల్ మీ జీటీ 7 ప్రొ పేరిట కొత్త గేమింగ్ ఫోన్‌ను లాంచ్ చేసింది. పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే 6.78 అంగుళాల కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. అలాగే 5,800 mah బ్యాటరీ 50 mp ప్రధాన కెమెరా, 8mp అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా 16mp సెల్ఫీ కెమెరా అమర్చారు. 12GB, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59,999గా ఉంది.