AP: శ్రీసత్య సాయి జిల్లా రామగిరి మండలంలో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. 14 మంది యువకులు దళిత బాలికను వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశారు. రెండేళ్లలో పదేపదే అత్యాాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. అట్రాసిటీ, పోక్సో కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు. మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. వీరు గతంలోనూ నలుగురిపై లైంగిక దాడి చేసినట్లు గుర్తించారు.