మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో దారుణం జరిగింది. కర్ణాటకలోని బెల్గాంకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినిపై తోటి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మే 18 రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపింది. ఆపై ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.