ఏపీలో జీబీఎస్‌ వైరస్.. ఆందోళనలో ప్రజలు

52చూసినవారు
ఏపీలో జీబీఎస్‌ వైరస్.. ఆందోళనలో ప్రజలు
AP: రాష్ట్రంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ వైరస్ వ్యాపిస్తోంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్‌ వ్యాధితో చనిపోయిన విషయం తెలియడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్