ఫుడ్ డెలివరీ సేవల్లోకి రాపిడో!

65చూసినవారు
ఫుడ్ డెలివరీ సేవల్లోకి రాపిడో!
రాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉన్న జొమాటో, స్విగ్గీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న రాపిడో, రెస్టారెంట్ల నుంచి కేవలం 8–15% కమీషన్‌ మాత్రమే వసూలు చేయనుంది. ఈ నెలాఖరు నుంచి బెంగళూరులో ప్రయోగాత్మకంగా తన సేవలను ప్రారంభించనుంది. రూ.400 లోపు ఆర్డర్‌కు రూ.25, అంతకంటే ఎక్కువ ఆర్డర్‌కు రూ.50 డెలివరీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ వార్తలతో సోమవారం స్విగ్గీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

సంబంధిత పోస్ట్