యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం కూడా క్యాన్సర్కు ఒక కారణమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భం ధరించిన తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఎంతోమంది ఉద్యోగాల పేరుతో పెళ్లి, పిల్లల్ని కనటాన్ని వాయిదా వేసుకోవడటం ఫలితంగా రొమ్ముక్యాన్సర్ ముప్పు పెరుగుతోందని అంటున్నారు. కాబట్టి 22 నుంచి 24 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుని 28 ఏళ్ల లోపు తొలి బిడ్డను కనటం మంచిదని సూచిస్తున్నారు.