ఏసీకి అలవాటు పడితే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. చల్లని వాతావరణంలో నీరు తాగకపోవడంతో డీహైడ్రేషన్ సంభవించి కిడ్నీలు దెబ్బతింటాయి. అలాగే, ఎక్కువ కాలం ఏసీలో ఉండటం వల్ల గాలిలోని బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల ఇన్ఫెక్షన్‌ల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఏసీకి ఎక్కువగా అలవాటు పడకుండా ఉండడం చాలా ఉత్తమం.