TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 15 స్టాండింగ్ కమిటీ సభ్యుల స్థానాలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయని GHMC కమిషనర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కమిటీ సభ్యులుగా నిలబడిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది.