భారత జట్టు పరిస్థితి క్లిష్టంగా మారిన సమయంలో కండరాల నొప్పిని సైతం లెక్క చేయకుండా ఆడిన యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ చివరి వరకు ఆడి 87 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక గిల్‌కు తోడుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ 59, అక్షర్ పటేల్ 52 అర్ధ శతకాలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో భారత్ ఛేదించింది.