వైభవ్ సూర్యవంశీ..14 ఏళ్లకే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి తన ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. అండర్-19 జట్టు తరఫున ఆడుతూ ఇంగ్లండ్‌పై సెంచరీ నమోదు చేశాడు. తాజాగా గిల్ తనకు స్ఫూర్తి అని తెలిపాడు. ‘మా జట్టు టీమ్ మేనేజర్ చెప్పే వరకు నేను రికార్డు సెంచరీ కొట్టానని తెలియదు. త్వరలోనే డబుల్ సెంచరీ చేసేందుకు ప్రయత్నిస్తా. నేను గిల్ ఆటను చూశా. శతకం ద్విశతకం తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూనే ఉంటాడు’ అని తెలిపాడు.