యాదాద్రిలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు

2చూసినవారు
యాదాద్రిలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వాతి నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని మూలవరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్