TG: మహబూబ్‌నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతిని నగ్నంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏజాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు శనివారం చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ గాంధీ నాయక్ మాట్లాడుతూ.. ఏజాస్ స్థానికంగా ఫోటో స్టూడియోను నడుపుతున్నాడని, ఫొటోలు దిగేందుకు వచ్చిన యువతిని ట్రాప్ చేసి, నగ్నంగా ఉన్న దృశ్యాలను వీడియో తీసినట్లు వెల్లడించారు. ఆ వీడియోను చూపిస్తూ యువతిని బెదిరించినట్లు ఆయన తెలిపారు.