బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. మనీషా అనే వివాహిత రాజేష్ కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసి తీవ్ర గొడవలు జరగడంతో మనీషా ఉరేసుకొని చనిపోయింది. అయితే మహిళ కుటుంబసభ్యులు తమ కుమార్తె చావుకు రాజేష్ కారణమని మృతదేహాన్ని అతడి ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. రాజేష్ కుటుంబసభ్యులు కూడా వెళ్లిపోవడంతో మూడు రోజులుగా ఇంటి ముందు ఉన్న మృతదేహానికి అధికారులే మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.