హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐలో పూర్తిగా పట్టు సాధించబోతున్నామన్నారు.