రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన RRR సినిమా ప్రపంచమంతా ప్రశంసలు పొంది, ప్రపంచంలోని పలు అత్యున్నత సినీ అవార్డులతోపాటు, ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది. రామ్ చరణ్ RRR సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. తాజాగా అమెరికాలో నిర్వహించిన పాప్ ప్రతిష్టాత్మకమైన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డుని సొంతం చేసుకున్నారు.