తిరుమలలో వైభవంగా చక్రస్నానం (వీడియో)

59చూసినవారు
వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శనివారం వైభవంగా చక్రస్నానం జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు అర్చకులు ఈ ఘట్టాన్ని నిర్వహించారు. EO శ్యామలరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం 2వ రోజు కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 60,094 మంది భక్తులు దర్శించుకోగా, 14,906 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్