ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బంగారం ధర

84చూసినవారు
ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బంగారం ధర
బంగారం ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నాయి. 10 గ్రాముల మేలిమి పసిడి ధరం రూ.96 వేలు దాటింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధం తారస్థాయికి చేరడంతో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.6 వేలు పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.96,540గా ఉంది. త్వరలోనే పసిడి ధరలు రూ.లక్షకు చేరుకునేలా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్