ప్రస్తుతం 10గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరువలో ఉండగా, ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాది బంగారం ధరలపై అంచనాలు మూడుసార్లు మార్చింది. తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది చివరికి బంగారం ధర రూ.1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందట. పెరుగుతున్న మాంద్య భయాలు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల రక్షణ దృష్టితో బంగారంలో పెట్టుబడులు పెరగడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.