గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.89,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.110 తగ్గి రూ.97,580కి చేరింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.1,17,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.