గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.87,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 తగ్గి రూ.95,180కి చేరింది. కేజీ వెండి ధరపై రూ.100 తగ్గడంతో రూ.1,09,800 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.