తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇక వరుసగా రెండో రోజూ బంగారం ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.79,900 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గడంతో రూ.87,160కు చేరింది. మరోవైపు వెండి ధర రూ.100 పెరగడంతో కేజీ రూ.1,08,100గా ఉంది.