హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.80,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.870 పెరగడంతో తొలిసారి రూ.87,930లకు చేరింది. మరోవైపు వెండి ధర రూ.100 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.