బంగారం ధరలు వరుసగా రెండో రోజుకు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.99,280కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగి రూ. 91,000 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,18,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.