చిలగడదుంపలతో మంచి ఆరోగ్యం

62చూసినవారు
చిలగడదుంపలతో మంచి ఆరోగ్యం
స్వీట్ పొటాటో వేరు కూరగాయలలో ఒకటి. స్వీట్ పొటాటో చాలా పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారం. శీతాకాలంలో లభించే చిలగడదుంపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్స్‌తో పాటు షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్-సి ఎక్కువగా ఉండడంతో జలుబు, ఫ్లూ నుంచి తప్పించుకునే శక్తి వస్తుంది. చిలగడదుంపలో ఉండే పొటాషియం, కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి.