ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు మరో అవకాశం కల్పిచింది. రేపటి (జనవరి 30) వరకు రూ. 3వేల ఫైన్ తో తత్కాల్ స్కీమ్ కింద ఫీజు చెల్లించవచ్చని ప్రకటనలో తెలిపింది. కాలేజీలు, విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు మరోసారి పెంపు ఉండబోదని స్పష్టం చేసింది.