నేతన్నలకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

52చూసినవారు
నేతన్నలకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. వారి కోసం 'వర్కర్‌ టూ ఓనర్‌' పేరుతో ఒక కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇటీవల సమావేశమై ఈ పథకం అమలుపై చర్చించారు. ఇందులో భాగంగా గతంలో నిర్మించిన వీవింగ్ రూములలో పవర్ లూమ్స్ ను ఏర్పాటు చేసి అర్హులైన చేనేత కార్మికులకు అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక దీనిపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్