హైదరాబాద్ వాసులకు మెట్రో మరో శుభవార్త చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ జిప్ వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వీటి ద్వారా ప్రయాణికులు స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు సులభంగా చేరుకోవచ్చు. మెట్రో స్టేషన్ నుంచి ఇళ్లు, కార్యాలయం, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేకుండా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.